తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కేందుకు సర్వం సిద్దమవుతోంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 19న ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ ట్రైన్‌ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే.. ట్రాక్ అప్‌గ్రేడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తి కావడమే కాదు.. పలువురు నేతలు విశాఖపట్నం వరకు వందేభారత్ ట్రైన్‌ను పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది.